BCCI: క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులు..ఆంక్షలు సడలించిన బీసీసీఐ 1 y ago
విదేశీ పర్యటనల్లో భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులు ఉండటంపై BCCI ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో బీసీసీఐ వెనక్కు తగ్గినట్టు సమాచారం. టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ అవడం, ఆస్ట్రేలియా టూరులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత ఆటగాళ్లకు 10 పాయింట్ లతో కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది. అందులో 45 రోజుల విదేశీ పర్యటనలకు ప్లేయర్ల కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది.